ఆనందాన్ని ఇచ్చేది అబద్దం

ఆనందాన్ని ఇచ్చేది అబద్దం...
కన్నీరు తెచ్చేది నిజం...
నువ్వు నాతోనే ఉన్నావన్న అబద్దాన్నే నమ్ముతున్నా..
నీ తోనే కలసివుంటాను అనే అబద్దం కన్నా....
నిన్ను తలవని క్షణం లేదు
పగటి పూట దీపమెందుకు?
రాతిబండకు రగిలేజ్వాలలు ఎందుకు?
నీవు నన్ను తలచుకోనప్పుడు,
నీ ఙ్ఞాపకాల గత సృతులెందుకు?

మానవుడికి దానవుడికి తేడా ఏమిటి?

మానవుడికి దానవుడికి తేడా ఏమిటి?
పక్షిని ఆకాశంలో ఎగురనీయడం దానవుడి ప్రేమ!!
దాన్ని పంజరంలో బంధించి ఆనందించడం మానవుడి ప్రేమ!!

మనసు లోని భావాలెన్నొ

మనసు లోని భావాలెన్నొ... మరువలేని గాయలెన్నో...
వీడలేని నేస్తాలెన్నో...
వీడిపోని బంధాలెన్నో...
మరపురాని పాటలెన్నో...
మధురమైన క్షణాలెన్నో...
కవ్వించే కబుర్లెన్నో...
మాయమయ్యే మార్పులెన్నో...
అవసరానికి వాదిన అబ్బద్దలెన్నో...
తుంటరిగా చెసిన చిలిపి పనులెన్నొ..
అశ్చర్యపరిచే అద్భుతలెన్నో...
మాటల్లొ చెపలెని ముచట్లెన్నో...
ముసుగువేసిన మనస్సుకు మరువరాని గ్నాపకాలెన్నో...
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...మనిషి జీవితంలో మరువలేనివి మరెన్నో..
ఇదేరా జీవితం దీన్ని అనుభవించు అనుక్షణం..!!!

నిన్ను తలవని క్షణం లేదు

నిన్ను తలవని క్షణం లేదు.
నన్ను నేను మరచిన నిన్ను నేను మరువలేదు.
నీవు నన్ను తలవక పోయిన నీమీద నాకు కోపంలేదు.
నిన్ను నేను మరచినవేళ నాకు జీవితమేలేదు.
మవడానికి మరణమే శరణ్యం అనుకుంటే, దానికి అంతటి ధైర్యంలేదు.

కలలో కలిశావనుకున్నా

కలలో కలిశావనుకున్నా
కలలో కలిశావనుకున్నా....
కలగానే మిగిలిపోయావనుకున్నా...
అది కల కాదని నేడే తెలుసుకున్నా...
నిన్ను విడువాలనుకున్నా ....విడువలేక నేనున్నా...

ఏమిటి ఈ బంధం ...?

ఏమిటి ఈ బంధం ...?
ఎంత వరకు ఈ పయనం....?
మా మధ్య నెలవైన బంధమా....
నీ వైనా తెలుపుమా....నీ పేరేమిటో....?
మనసు విప్పి మాట్లాడు!

అడగదు ఏమిటి

అడగదు ఏమిటి కులమని స్నేహం,
చూడదు ఏ మతమని స్నేహం,
కోరుతుంది తనవారి హృదయములో స్థానాన్ని,
దాని కోసం లెక్క చెయ్యదు ప్రాణాన్ని,
గడిచిపోతే తిరిగి రాదు మనంకోసం,
వో తియ్యని అనుభవం స్నేహం,
మరిచిపోతే అది తిరిగి కల్లలీనే ,
సుఖ సంతోషాల నిలయం స్నేహం,
పోతే తిరిగి కాదది మన సొంతం,
కడవరకు విడిపోని బంధం స్నేహం,
మరువలేని మరుమల్లె స్నేహం,
తియ్య తియ్యని అనుభవాల ,
అందమైన జీవితం,అనుబంధాల సంగమం స్నేహం............
ఎన్ని జన్మలకైనా ఇలాగే .......................
అని నమ్మే నిజమైన స్నేహాన్ని నేను.............!!!!!!

ఓ అమ్మాయి

ఓ అమ్మాయి మనసివ్వాలని ఆరాటపడింది
ప్రతిక్షణం తనలో తనే తర్జన బర్జన పడింది
ప్రపంచమంతా తనలాగే స్వచ్చమైనదనుకుంది
అందమైన లోకమని భ్రమపడింది
ప్రేమే లోకమనుకుని ప్రేమలో పడింది..

ప్రేమించాకే తెలిసింది....

ఆ అమ్మాయి ఇప్పుడు ఆలోచిస్తుంది
లోకం రంగులమయం అనితెలుసుకుంది
అమాయకత్వంతో మోసపోకూడదనుకుంది
ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమేనంటుంది
స్థిరమైన గమ్యంతో ముందుకి సాగిపోతుంది..

మనసు విప్పి మాట్లాడు!

మనసు విప్పి మాట్లాడు!
నీలోని భావాలకి ఒక రూపం ఏర్పడుతుంది.
చిలిపి తగవులతో నాతో పోట్లాడు!
బుజ్జగించడానికి నాకొక వంక దొరుకుతుంది.

ప్రేమకి మరణం లేదంట

ప్రేమకి మరణం లేదంట!
అందుకే మరల మరల ప్రేమిస్తారంట!
ఒకరు మనసు విరిస్తే వేరొకరు అతికిస్తారంట!
ఇదీ నేటితరం ప్రేమికుల మాట!!!

ముందు ప్రేమనేది ఒకరికే అయేది సొంతం!
అందుకే అప్పుడు దేవదాసు పార్వతీలు అయ్యారు అంతం!
ఇప్పుడు చూడు ప్రేమకి మారింది అర్ధం!
మునుపటిలా ఎవరూ ప్రేమను చేయడంలేదు వ్యర్ధం!!!

దేవదాసుకి పార్వతి కనిపిస్తుంది అందరిలో!
పార్వతి చూస్తుంది దేవదాసుని కొందరిలో!
ఏది ఏమైనా ప్రేమనేది వుంది ప్రతి ఒక్కరిలో!
మార్పు వచ్చింది మానవుని ఆలోచనా సరళిలో!!!

అందమైన జీవితాన్ని

అందమైన జీవితాన్ని ఏయే రంగుతో అద్దమంటావని నన్నడిగితే!!
మనసుని స్వఛ్ఛంగా వుంచే తెలుపుకే మొదటి స్థానమంటాను.
ఎరుపు క్రోధానికే కాదు ప్రేమకి కుడా చిహ్నమేనంటాను.
నీలంలోని నిర్మలత్వాన్ని సొంతం చేయమంటాను.
పచ్చని పైరు గాలిలా జీవితం సాగిపోవాలనుకుంటాను.
పసుపు పవిత్రతతో పాటు శుభాలను ఒసగుతుందనుకుంటాను.
నలుపు రంగా నేను నిన్నెలా మరచి పోతాను!!
ఇన్ని రంగులను చూపిన కనుగుడ్డే నీవంటాను.
అందరి జీవితాలు రంగులమయం కావాలని నే కోరుకుంటాను.!!!

బట్ట కడితే సంసారి

బట్ట కడితే సంసారి
బట్టవిప్పితే వ్యభిచారి
మానాని ప్రాణానికి అడ్డం బట్టలే
బట్ట నిండా కట్టుకో
బాద్యతలను తెలుసుకో
అర బట్టతో తిరుగకు
అల్లరి పాలు కాకు
"ఆడ "తనానికి మచ్చ తెబూకు

నీవు

నీవు వస్తున్నావని చిరుగాలి కబురు తెచ్చింది
అది విన్న నా మనసు నాట్యమాడింది
ఇప్పుడే నా చుట్టూ వెన్నెల విరబూసింది
నీవు లేక నా కంటి కాటుక కరిగింది
ప్రతిరోజు నా కన్నీరే నాకు తోడైంది
నేను వద్దన్నా నా మనసు నీ వెంటవచ్చింది
ఇంతవరకు పెదవులపై చిరునవ్వు కరువైంది
నీవు వచ్చాకే నాకు తెలిసి వచ్చింది
వెన్నెలకూడా నాపై ఇన్నాళ్ళు అలిగింది
నీ అండతో నా మనసు నామాట వినను అంటుంది
ఇప్పుడు గుర్తొచ్చానా అని అద్దం నన్ను ప్రశ్నించింది
ఆ ప్రశ్నకి నా సిగలోని ఎర్ర గులాబి పక్కున నవ్వింది
ఇది చూసిన నా హృదయం కొంగుచాటున దాగింది
నీలా నేను దాగలేనంటూ నా ముఖం విప్పారింది
నీవే నా ఆనందాన్ని తిరిగి తీసుకుని వచ్చింది....

నా చిట్టి కవిత

నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా
నా తలపుల నుండి ఎటు వెళ్ళిపోయావమ్మా
ఈ జనసమూహంలో ఎక్కడ చిక్కుకున్నావమ్మా
నిన్ను ఇందరిలో ఎక్కడని వెతుకనమ్మా
నలుగురి పెదవులపై నవ్వైనావామ్మా
నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా?

ప్రతి ఒక్కరూ నీకై వెతుకుతున్నారమ్మా
ఎందరి కనుసైగలనుండి నీవు తప్పించుకోగలవమ్మా
ఆకాశంలోని తారలను అడిగానమ్మా
ఎవరి హృదయంలోనైనా చిక్కుకున్నావామ్మా
పూలలోని సుగంధంలో దాగున్నావామ్మా
నా చిట్టి కవిత ఎక్కడ తప్పిపోయావమ్మా?

కెరటాలకి

కెరటాలకి భయపడి నౌక తీరం చేరుకోదు
ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీలేదు...
క్రిందపడి లేచి పరుగిడే ప్రయత్నం నీవు చేయి
కష్టానికి తగ్గ ఫలితం తప్పక ఉంటుందోయి...
చీమ ఆహారాన్ని చేరవేస్తూ పడిలేస్తూ ఉంటుంది
మనలో నమ్మకం ఉంటే విజయం తప్పక వరిస్తుంది...

ఓటమిని అనుకోకు ముళ్ళబాటగా
ధైర్యంతో దాన్ని మలచుకో పూలబాటగా...
ఏదీ సాధించలేనివారిని ఎవరూ గుర్తించరు
మనలోని మంచితనాన్ని ఎవరూ తుదముట్టించలేరు...
అనుకున్నది సాధించే వరకు నిదురపోకు
సంఘర్షణ అనే మైదానం నుండి పారిపోకు...
సముద్రగర్భం నుండి ముత్యాన్ని సాధించడం బహుకష్టం
అలాగని నీవు వెనుతిరిగి రాకు రిక్తహస్తం......

చదువు

చదువుని నిర్లక్ష్యం చేసిన నాడు! ఇంగితం లేదు, వివేకం లేదు.
గాలివాటుకి గమ్యం లేకుండా తిరిగిన నాడు! అడ్డులేదు, అదుపు లేదు.
లక్ష్యం లేని జీవితాన్ని గడిపిననాడు! భయమూ లేదు, ఆశయమూ లేదు.
ప్రేమతో దరిచేరిన ఆ నాడు! నీపై ఆకర్షణయే తప్ప నిజమైన ప్రేమ లేదు.

జీవితంపై స్పష్టత వచ్చిన నేడు! జీవిద్దామంటే ఆరోగ్యం, ఆయుషు లేదు.
ఆస్తులు, అంతస్తులు ఉన్న నేడు! నాకంటూ ఎవరూ తోడు లేరు.
పలకరించ వచ్చిన నాకు, నేడు! మౌనం తప్ప మాటలే రావడం లేదు.
చెప్పలేని భావాలెన్నోఉన్నా, వ్యక్తపరిచే సమయమిది కాదు, లేదు.....

స్నేహం

స్నేహం చేయడం సులభం
నిలబెట్టుకోవడమే కష్టం...
ప్రేమించడం సులభం
ప్రేమించబడడం కష్టం...
నమ్మడం సులభం
నమ్మించడం కష్టం...
గుర్తుంచుకోవడం సులభం
మరచి పోవడం కష్టం....
అసత్యమాడడం సులభం
నిజం ఒప్పుకోవడం కష్టం...
ఏడిపించడం సులభం
నవ్వించడం కష్టం...
ఇలా కవిత వ్రాసేయడం సులభం
అది అందరిని మెప్పించడం కష్టం...

ప్రేమని పొందాలని నా మనసు చేస్తుంది పోరాటం

ప్రేమని పొందాలని నా మనసు చేస్తుంది పోరాటం
నీ హృదయంలో స్థానానికై పడుతుందది ఆరాటం

కనులు గాయ పరుస్తున్నాయి కంటిచూపునే
పలు ప్రశ్నలతో నామనసు వేధిస్తోంది నన్నే

కనులు చీకట్లో కారుస్తున్నాయి కన్నీరు
వాటికి ఇంకా అలవాటు కాలేదు వెలుతురు

ఎంతో మంది మేధావులకే దక్కలేదు ప్రేమనేది
ప్రేమించి శిక్షను అనుభవిస్తుంది నా మనసనేది

ఒకరోజు నీవు పంపిస్తావు నీ ప్రేమ పుష్పాలని
చూస్తావప్పుడు నా హృదయానికైన గాయాలని

కన్నీళ్ళు కూడా నీ మనసుకి అమ్ముడు పోతాయి
మౌనంగానే మన హృదయాలు రెండూ రోధిస్తాయి

నిన్ను నేను తప్పక గెలుస్తాను వేచియుండు
నీ నుండే నిన్ను లాక్కుని పోతాను చూస్తుండు!

గాయం మానలేదనుకుంటే

గాయం మానలేదనుకుంటే
మరో గాయానికి గురి చేస్తున్నావు.
కన్నుల నిండా నీరుంటే
నవ్వుతూ వుండమని మారం చేస్తున్నావు.
హృదయం దహించి వేస్తుంటే
వెలుగుకోసమై వెతకమంటున్నావు.
నిజాలే భయపెడుతుంటే
నిందలని ఎలా నమ్మమని అంటావు.
కంటికి కునుకే రాకుంటే
కమ్మని కలలు ఎలా కనమంటావు.
నీడైనా నాకు దక్కలేదంటే
తోడుకోసమై ఎదురు చూడమంటావు.
చుట్టూ పొగ కమ్మి ఉంటే
మంచు జల్లు కురియబోతుందని అంటావు.
బ్రతుకే భారమైనది అనుకుంటే
ఇదే జీవితం ఇలాగే సాగిపోవాలంటున్నావు.

ప్రియా

ప్రియా! తారలను కన్నీటితో చూస్తే మెరుస్తాయి ఎందుకని!
విరహములో వర్షించే ఆశువులకి రంగులేలా? అందుకని...

నీవు లేకపోతే మేఘాలు వర్షించవు ఎందుకని!
నాలోనే థూఃఖాన్ని దిగమింగుకున్నాను అందుకని...

పలుకని పెదవులు పరిభాషలాడుతున్నాయి ఎందుకని!
మనస్సులోని భావాలకి ఏ భాష అడ్డుగోడలు కావు అందుకని...

చలికాలంలో వడగాల్పులే వీచవు ఎందుకని!
ప్రేమలో అనుమానాలకి తావేలేదు అందుకని!

వెతుకుతున్నా వియోగాన్ని మించిన భారమేదైనా ఉందేమోనని!
మౌనంగా ఉన్నా దీనికి నాదగ్గర సమాధనం లేదు అందుకని....

ఓ చందమామ

ఓ చందమామ.... నాపై వెన్నెలని కురిపించవా
మదిలోని వేదనని మరిపించి మురిపించవా
ఇరువురి నడుమ ఉన్న ఎడబాటుని దూరంచేయవా
సుందర స్వప్నాలలో మమ్ము విహరించ నీయవా!

నేనొక స్వప్నాన్ని నన్ను ప్రేమించమనకు
ప్రేమిస్తే ఇంక నన్ను మరువమని అనకు
గాలితెమ్మెరలు వచ్చిపోతుంటాయని చెప్పకు
కలువకు నీకు నడుమ ఉన్న ఎడబాటుని గుర్తుచేయకు!

పగలు రాత్రి కూడా కలిసే అవకాశముందని చెప్పు
కొమ్మ నుండి వేరైన రెమ్మ కూడా విరబూస్తుందని చెప్పు
వెన్నెలంటి మనస్సుందని నన్ను నీతో పోల్చి చెప్పు
నా పిచ్చి కాని...ఏం చెప్పాలో నీకు తెలియదా చెప్పు!!!

మనస్పూర్తిగా నన్ను ప్రేమించు!

మనస్పూర్తిగా నన్ను ప్రేమించు!
ఆ ప్రేమే జీవితానికి ఒక ఆలంబనమౌతుంది.
అంతులేని అనురాగాన్ని చూపించు!
అనురాగమే నా ప్రేమకి ఒక ఆకారాన్నిస్తుంది.

చిరుగాలులు నీకు చింతనిస్తున్నాయా!

చిరుగాలులు నీకు చింతనిస్తున్నాయా!
నా తలపులు నీలో తబ్బిబౌతున్నాయా!
నా ఊసులేమైనా నీకు ఊరటనిస్తున్నాయా!
నీ కనులు స్వప్న లోకాలలో విహరిస్తున్నాయా!
తొలిపొద్దు కిరణాలు నిన్ను తట్టిలేపుతున్నాయా!
ప్రతి పనిలో మన హృదయాలు ప్రతిబింబిస్తున్నాయా!
ఋతువులు నన్ను చేరమని నిన్ను అల్లరి పెడుతున్నాయా!
నా ఉనికిని నీతో ఊహించి నీ పెదవులు విచ్చుకుంటున్నాయా!
విచ్చుకున్న పెదవులను చూసి నీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయా!
ఎడబాటెన్నాళ్ళని తనువులోని అణువణువులు ప్రశ్నిస్తున్నాయా!
నీ ఆలోచనలు నిన్ను నా దరి చేరమంటూ ఆరాట పెడుతున్నాయా!
నీ రాకతో నా సందేహాలు తీరతాయని అనుకుంటాను ప్రియా!!!
నీ కొరకై వేయి కన్నులతో ఎదురు చూస్తుంటాను ప్రియా!!!!

నీ కంటిపాపలో నన్ను సింగారించుకో!

నీ కంటిపాపలో నన్ను సింగారించుకో!
లోకమంతా రంగులమయమై కనిపిస్తుంది.
నీ పెదవులపై చిరునవ్వుగా నన్నుంచుకో!
జీవితమే ఆనంద ఊయలై ఊగుతుంది....

వద్దన్నా వచ్చేది మరణం...

వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం

విరిసిన వెన్నెల కరిగిపోతుంది...

విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...

భగవంతుడా!

భగవంతుడా!
అందమైన రూపాన్ని ప్రసాదించవేల?
నిర్మలత్వాన్ని మించిన నిగారింపు నీకేల!!!

ఆనంద ఢోలికలలో ఊగించవేల?
తృప్తిని మించి ఆనందము ఉన్నదందువా బాల!!!

అష్ట ఐశ్వర్యాలను ఒసగరాదటేల?
ఆశాసౌధాలకి అంతమే లేదేల!!!

ప్రేమానురాగాలను అందించరావేల?
ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోమని వేరే చెప్పాల!!!

ఇందరిలో నాకే ఇన్ని కష్టాలేల?
మెరిసేదంతా పుత్తడి కాదు తెలుసుకోవేల!!!

మనశ్శాంతిని కలుగచేయ రావేల?
రాగద్వేషాలలో నీవు బంధీవైనావేల!!!

ఎదుటి వారికొరకై నే ప్రార్ధన చేయనేల?
చేయూతనీయని చేతలులేని ప్రార్ధన చేయు పెదవులేల!!!
నువ్వు తీరానివి అయితే...!

నువ్వు తీరానివి అయితే,
నిన్ను చేరే ఆ కడలి కెరటాని నేనవుతా............

నువ్వు చిరుజల్లువి అయితే,
నిన్ను తాకే ఆ చిరుగాలిని నేనవుతా..................

నువ్వు ఆశవి అయితే,
నిన్ను చేరే ఆ శ్వాశని నేనవుతా........................

ప్రియ నేస్తం....

ప్రియ నేస్తం.... ప్రపంచం అంతా దూరం అయినా... నీకు ‘నేను’ ఉన్నా అని
చెప్పేవాడే “స్నేహితుడు...ఆ స్ధానంలో నాకు “నాకు నువ్వు” “నీకు నేను” ఒకరి
కొకరు.. ఈ స్నేహమే మన ప్రపంచం “నువ్వు అనే ఈ రెండక్షరాలే నా చేయి పట్టి
నడిపిస్తుంటే...నువ్వు అనే ఈ రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని
వేస్తుంటే...నువ్వు అనే ఈ రెండక్షరాలే నన్ను ఇంతగా ప్రభావితం
చేస్తుంటే.....ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో... నువ్వు నా
చుట్టూ పెనవేస్తుంటే.....నీ స్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే
........... నాకు నువ్వు వున్నావనే భావన.....మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే,
నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని.....ఈ ప్రపంచానికంతా
వినపడేలా అరిచి చెప్పాలని వుంది..... “ఇదిగో నా ప్రియ నేస్తం అని
ఈ ఉరుకుల పరుగుల జీవనంలో

ఈ ఉరుకుల పరుగుల జీవనంలో పరుగిడి చేసేదేముంది
చంద్రున్ని చేతపట్టి రేయిని ఆపి ప్రయోజనమేముంది

సూర్యోదయం ఎప్పుడౌతుందో తెలియదు
సూర్యాస్తమయం అస్సలు గుర్తుకే రాదు

సెల్ ఫోన్, టెలిఫోన్ పలకరింపులే అందరు
ప్రేమాభిమానాలతో పలకరించే వారెందరు

ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో అందరితో ఉంది టచ్
పక్కింట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోము మనం మచ్

ఏయే ఛానల్ లో ఏ కార్యక్రమాలో తెలుసు అందరికి
తల్లిదండ్రులని పరామర్శించే సమయం లేదు ఎవ్వరికి

మనశ్శాంతితో మనిషి జీవించ లేకపోతున్నాడు ఎందుకని
108 ఛానల్స్ లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోతుందెందుకని

ఇటువంటి ఉరుకుల పరుగుల జీవనంలో పరుగిడి చేసేదేముంది
ఇలాగే జీవించాలి అనుకున్నప్పుడు మరణించి లాభమేముంది!!!!

కన్నులు కలలను మరచిపోవు...

కన్నులు కలలను మరచిపోవు...
కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...

మిత్రులే కదా.....!!!!!

మిత్రులే కదా అని పదిమందితో చర్చించకు.
నీ ప్రేమను గూర్చి నలుగురితో మాట్లాడకు..
వాళ్ళు నిన్ను హేళన చేస్తారేమో!!!

సూర్యచంద్రులకి నీ వేదనను వివరించకు
పరిష్కారం కొరకై వాళ్ళని ప్రాధేయపడకు..
విశ్వమంతా వారై విసిగి వేసారినారేమో!!!

చీకటికి నీ గోడుని వెళ్ళబుచ్చకు
అంధకారమేదో దారి చూపుతుందనుకోకు..
రేయికి తన వెలుగే తనకి కరువైందేమో!!!

సాగర కెరటాలని పలకరించకు
ఆలోచనా తరంగాలలో విహరించకు..
సుడిగుండాల్లో నిన్ను చుట్టేస్తాడేమో!!!

ఆకాశంవైపు ఆశగా చూడకు
ప్రేమలో సహాయ పడమని కోరకు..
చిరాకుతో నిన్ను ఉరిమి చూస్తాడేమో!!!

చెలియ కంటపడిన వేళ మౌనం వహించకు
మౌనంతో తనని వేధించకు..
నిజమైన ప్రేమైతే నీకే దక్కుతుందేమో!!!

అలసిన నా మనసుకు......

అలసిన నా మనసుకు......
నీ నవ్వు కావాలి...........
అలసిన నా కనులకు.......
నీ కలలు కావాలి..........
అలసిన నా ఆలోచినలకు........
నీ పిలుపు కావాలి...........
అలసిన నా పాదాలకు.........
నీ తోడు కావాలి........
నీ నవ్వులో చోటి స్థావా ....
చిరు నవ్వు నేను అవుతాను....
నీ కన్నుల్లొ చోటి స్థావా ....
కను పాపను నేను అవుతాను....
నీ మదిలో చోటి స్థావా ....
మనసంతా నేను అవుతాను ....
నీ శ్వాసలో చోటి స్థావా ....
నీ ఊపిరి నేను అవుతాను ....
నీ జీవితం లో చోటి స్థావా ....
నీ జత నేను అవుతాను ....

మబ్బులా కమ్ముకుంటాయి...

మబ్బులా కమ్ముకుంటాయి...
ఏకధాటిగా కురుస్తాయి...
నదీ ప్రవాహంలా ప్రవహిస్తాయి...
తడిసిన మల్లెలౌతాయి...
జ్ఞాపకాలన్ని గుర్తుకొస్తాయి...
నీవు గుర్తుకొస్తే నా కళ్ళు ఇలా వర్షిస్తాయి!

కంటి నిండా కలలున్నాయి...
అవి ఎప్పటికి తీరుతాయి...
గొంతులోని మాటలు పెదవి దాటనంటున్నాయి...
చేతులు చిత్రాన్ని గీయాలని ప్రయత్నిస్తున్నాయి...
కుంచె ఉంది, రంగులూ ఉన్నాయి...
నీ చిత్రాన్ని గీయాలంటే కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...

నా గుండెను రాతి బండను చేయి...
పగిలి పోయిందనుకో ఆ రాయి...
నన్ను మట్టిలో కలిపి వేసేయి...
భగవంతుడా! నీవు నాకు ఈ ఒక్క సహాయము చేయి...

మనసునవున్నది

మనసునవున్నది: తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?వయసు పెరిగేకొద్దీమనసు చిన్నదయిపోతుందా?ధనం వచ్చేకొద్దీఆనందం విలువ పెరిగిపోతుందా?ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి... కన్నె మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి !ఆ చిలిపి స్నేహితుడు చెంతచేరే చల్లని రోజెపుడు?
నేను ప్రేమించే వాలకన్న నన్ను ప్రేమించే వాళ్ళు అంటే నాకు ఇష్టం
నా ప్రీయ మైన నెస్తమా...!
నా చుపూ నీ కొసం ఏదురు చుస్థుంది...
నా స్వసా నీ కొసం తపిస్థుంది...
నా ప్రతి ఆశ నువ్వు గొప్ప వ్యక్తివి కావలని..
నా ప్రతి రక్తపు బొట్టు నీ కొసం చిందిస్తాను..
నా తుది స్వసా వదిలె వరకు నిన్ను మరవను..
ఆత్మకి చావు వుండదు.. మన స్నేహానికి కూడ చావు వుండదు..
నీ కొసం తపిస్తున్న ఈ స్నేహితుడిని మరవకు......................

Leave a Comment

Posted by under